ఆ యాపిల్ కంప్యుటర్ కంటే ఆడి కారు రేటే తక్కువ…!

-

యాపిల్” టెక్నాలజీ రంగంలో ఇది పెట్టింది పేరు… అత్యున్నత ప్రమాణాలు, క్వాలిటీ, ధరలకు కూడా యాపిల్ పెట్టింది పేరు… భారీ ధరలతో తమ ఉత్పత్తులను యాపిల్ అందిస్తుంది. మ్యాక్ బుక్, మ్యాక్, ఐపాడ్, ఇయర్ పొడ్స్, మ్యాక్ ప్రో, ఆపిల్ టీవీ… వంటి ఉత్పత్తులను అందిస్తుంది యాపిల్. యాపిల్ నుంచి వచ్చే ఏ ఉత్పత్తి అయినా సరే ధరలు అధికంగా ఉంటాయి. అందుకే మన దేశంలో యాపిల్ కి క్రేజ్ ఉన్నా సరే వాటిని కొనడానికి మాత్ర౦ చాలా మంది భయపడిపోతారు… అందుకే ఇండియాలో యాపిల్ అమ్మకాలు చాలా తక్కువ.

అయితే యాపిల్ ఉత్పత్తుల క్వాలిటి తెలిసిన వాళ్లకు మాత్రం… దానినే కొనుగోలు చెయ్యాలని ఉంటుంది. వాటి క్వాలిటి ఏ స్థాయిలో ఉంటుందో ధర కూడా అదే స్థాయిలో ఉంటుంది… ఏ ఉత్పత్తి అయినా సరే వేలల్లోనే ఉంటుంది. అయితే ఒక యాపిల్ కంప్యుటర్ ధర మాత్రం భారీగా ఉంది… ఆ ధర తెలిసితే గుండెల్లో రైళ్ళు పరిగెట్టడం ఖాయం… మ్యాక్‌ ప్రో కంప్యూటర్‌ ధర వింటే మాత్రం వినియోగదారులు భయపడిపోతున్నారు. దాన్ని చూడాలనే సాహసం కూడా చేయడం లేదు. బేసిక్‌ మోడల్‌ ఖరీదు ఆరువేల డాలర్లు,

అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 4,25,000. ఇక భారత్ లో అన్ని ట్యాక్స్లు కలిపి… 5 లక్షల వరకు అవుతుందని అంటున్నారు. ఇక పూర్తి మ్యాక్ కావాలి అంటే మాత్రం… ఆస్తులు అమ్మాల్సిందే. 53 వేల అమెరికన్ డాలర్లు. అంటే దాదాపు భారత కరెన్సీలో 38 లక్షలు. భారత్ లో అయితే… 40 లక్షలకు పైగా పలుకుతుందని అంటున్నారు. దానికంటే ఒక ఆడి కారు తక్కువ ఎండ్ లో కొనుక్కోవడం బెటర్ అని అంటున్నారు. అయితే దాని వలన సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఆలోచించే పని లేదు లెండీ…

Read more RELATED
Recommended to you

Exit mobile version