ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకుల కి సెలవులు..!

-

బ్యాంక్ లో మనకి కొన్ని ముఖ్యమైన పనులు ఉంటూ ఉంటాయి. వాటిని పూర్తి చేసుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే వాటిని సమయానికి పూర్తి చేసుకోవాలని అనుకునే సరికి బ్యాంక్ సెలవు కనుక అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ముందే మీరు సెలవులు గురించి చూసుకోండి. అప్పుడు ప్లాన్ చేసుకుంటే ఏ బాధ ఉండదు. చక్కగా టైం కి పనులు పూర్తి అయ్యి పోతాయి. ఏప్రిల్ నెల లో బ్యాంకులకు 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. అయితే ఎప్పుడు, ఏ చోట సెలవో ఇప్పుడే చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఏప్రిల్ 1 : క్లోజింగ్ డే

ఏప్రిల్ 2: ఆదివారం

ఏప్రిల్ 4: మహావీర్ జయంతి (అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, జైపూర్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్ మరియు రాంచీ)

ఏప్రిల్ 5 : బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు (హైదరాబాద్)

ఏప్రిల్ 7: గుడ్ ఫ్రైడే (అగర్తల, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, జమ్మూ, సిమ్లా మరియు శ్రీనగర్ తప్ప అన్ని చోట్లా సెలవే)

ఏప్రిల్ 8: రెండవ శనివారం

ఏప్రిల్ 9: ఆదివారం

ఏప్రిల్ 14 : అంబేద్కర్ జయంతి/బోహాగ్ బిహు/చీరాబా/వైశాఖి/బైశాఖీ/తమిళ నూతన సంవత్సరం/మహా బిసుభా సంక్రాంతి/బిజు/బుయిసు కారణంగా (ఐజ్వాల్, భోపాల్, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్ మరియు సిమ్లా తప్పప్రతి చోటా సెలవే)

ఏప్రిల్ 15: విషు/బోహాగ్ బిహు/హిమాచల్ డే/ బెంగాలీ నూతన సంవత్సరం (అగర్తలా, గౌహతి, కొచ్చి, కోల్‌కతా, సిమ్లా మరియు తిరువనంతపురం)

ఏప్రిల్ 16: ఆదివారం

ఏప్రిల్ 18 : షాబ్-ఇ-ఖదర్ (జమ్ము, శ్రీనగర్)

ఏప్రిల్ 21 : ఈద్-ఉల్-ఫితర్/గరియా పూజ/జుమాత్-ఉల్-విదా (అగర్తలా, జమ్ము, కొచ్చి, శ్రీనగర్ మరియు తిరువనంతపురం)

ఏప్రిల్ 22: రంజాన్ ఈద్ (అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, గ్యాంగ్‌టక్, కొచ్చి, సిమ్లా మరియు తిరువనంతపురం తప్ప ప్రతిచోటా సెలవే)

ఏప్రిల్ 23: ఆదివారం

ఏప్రిల్ 30: ఆదివారం

Read more RELATED
Recommended to you

Exit mobile version