Breaking : ఏపీలో రేపటి నుంచి బస్సు ఛార్జీలు పెంపు..

-

ఏపీలో ప్రయాణీకులకు షాకిచ్చింది ఏపీఎస్‌ఆర్టీసీ. ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని కీలక నిర్ణయించింది ఆర్టీసీ. డీజిల్ సెస్ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని చెబుతున్నారు అధికారులు. అయితే, డీజిల్ సెస్ పెంపు నుంచి సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించారు ఉన్నతాధికారులు. డీజిల్ సెస్ పెంపు కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేసింది. అంతర్రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం… ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధనఉందని టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.

APSRTC to run more buses to Hyderabad, Telangana districts

పల్లె వెలుగు బస్సుల్లో.. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10లుగా ఉంది. తొలి 30కిలోమీటర్ల వరకు సెస్ పెంపు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. 35 నుంచి 60 కి. మీ వరకు అదనంగా రూ.5లు సెస్ విధించారు. 60 నుంచి 70 కి.మీ. వరకు రూ.10. 100 కి.మీ ఆపైన రూ.120 సెస్ విధించారు. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రస్తుతం టికెట్పై రూ.5లు సెస్ వసూలు చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో 30కి.మీ వరకు సెస్ పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 సెస్. 66 నుంచి 80కి.మీ వరకు రూ.10 పెంపు. సూపర్ లగ్జరీ, ఏసీ  బస్సుల్లో టికెట్పై రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ. 70 సెస్ పెంపు. హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్ సెస్ విధించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version