ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే ఇది మీకు శుభవార్త అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ వివరాలని మీరు పూర్తిగా తెలుసుకుని అప్లై చేసేసి.. ఉద్యోగాన్ని పొందండి. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వస్తే… HBL Industries లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన విడుదల చేశారు.
మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్లై చేసుకునే వాళ్ళ వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే దీనికి అర్హులు అని ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12 వేల వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ఫుడ్, వసతి సదుపాయాలు లభిస్తాయి. ఇది ఇలా ఉండగా ఎంపికైన అభ్యర్థులు విజయనగరంలో పని చేయాల్సి ఉంటుంది.
మొదటగా అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత JAM Session మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్స్ ను తీసుకెళ్లాలి. సందేహాలు ఏమైమ ఉంటే 9000831156, 7386706272 నంబర్లను సంప్రదించవచ్చు.