ఐదేళ్లుగా అధికారంలో ఉండి చేయలేని అనులన్నీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే చేస్తామనడం ఆశ్చర్చాన్ని కలిగిస్తుంని.. ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో 420ని తలపిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన కడపలో వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల సమయంలో తన పరిధిలో లేనివి.. తాను చేయలేనివన్నీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారని, మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో అలాంటిది మరో మేనిఫెస్టో విడుదల చేసి మరోసారి మోసానికి తేర లేపారని ఆరోపించారు.
2014 మేనిఫెస్టే ఇప్పుడు..
2014 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలే ఈ మేనిఫెస్టోలో పెట్టారని పేర్కొన్నారు. అప్పుటి మేనిఫెస్టోలో ఇంటింటికీ నల్లా కనెక్షన్, వ్యక్తికి 20 లీటర్ల ఉచిత నీరంటూ హామీలిచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చాలేదని «ధ్వజమెత్తారు. ప్రజలు ఎంత అమాయకులుగా చంద్రబాబు భావించి ఇలాంటి మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని.. మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోపై కూడా త్వరలోనే ఫిర్యాదు చేస్తామని సజ్జల అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం కుప్పకూలిందని ఎద్దేవా చేశారు.
సొంతవాళ్లకే అర్థమవటం లేదు..
చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి ప్రవర్తిస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నారో సొంత పార్టీ నేతలకు ఆర్థమవ్వడం లేదని ఆరోపించారు. మరో మూడేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేవని టీడీపీ దుకాణం మూసుకోవాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ చేసిన మంచి పనులే ఆయనను ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేశాయన్నారు. తండ్రి వయసు అయిపోయిందని.. కనీసం కొడుకైన లోకేష్ రాజకీయం నేర్చుకుంటాడంటే అది కూడా లేదన్నారు. టీడీపీని తాము ప్రతిపక్షంగా ఉండాలని కోరుకుంటే వారు అలా వ్యవహరించపోవడం వారి ఖర్మఅని సజ్జల అన్నారు. ఇప్పటికైన సీఎం చేస్తున్న మంచి మనులు తెలుసుకుని ప్రజలకు ఏమైన మంచి చేయాలని ఆయన హితువు పలికారు.