నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్న విషయం ఒక్కసారిగా సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. గతంలో అన్నదమ్ములు మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవలు జరిగాయని సోషల్ మీడియాలో కొన్ని వీడియాలు వైరల్ అయ్యాయి.అయితే, అవన్నీ అవాస్తవాలని అప్పట్లో కొట్టిపారేశారు.
తాజాగా మనోజ్ మీద తండ్రి మోహన్ బాబు దాడులు చేయించారని కథనాలు వస్తున్నాయి. మంచు విష్ణు సహచరుడు విజయ్ మనోజ్ ఇంటికి వెళ్లి దాడులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్‌ను తీసుకెళ్లిపోయాడని సమాచారం. ఇక అన్నదమ్ములు ఇద్దరు బౌన్సర్లను కాపాలాగా పెట్టుకున్నారని టాక్. దీనికి తోడు మోహన్ బాబు తన కొడుకు మనోజ్ మీద పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. మనోజ్ సైతం తనపై దాడులు చేశారని పహాడీ షరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ గొడవలన్నీమోహన్ బాబు జల్ పల్లిలో నిర్మించుకున్న విశాలమైన ఇంటి కోసమే అని జోరుగా ప్రచారం జరుగుతోంది.