బంగాళదుంపపై ఆకుపచ్చ మచ్చలు వచ్చాయా? అయినా వాడేస్తున్నారా.?

-

బంగళాదుంపలు వాడని గృహిణి అంటూ ఉండరూ. వారానికి ఒకసారి అయినా వండుతారు. మార్కెట్‌కు వెళ్తే.. కేజీకి తక్కువ తెచ్చుకోరు. కొందరైతే రెండు మూడు కేజీలు కూడా కొంటారు. అయితే ఇంట్లో తెచ్చుకున్న బంగాళదుంపలో కొన్నిసార్లు ఆకుపచ్చగా మారిపోతాయి. అయితే మనం కుళ్లిపోతేనే పడేస్తాం కానీ.. ఇలా రంగుమారిపోతే పెద్దగా పట్టించుకోం. ఇలా రంగుమారిన బంగళాదుంపను తినటం మంచిది కాదంటున్నారు..వైద్యులు. ఎందుకో ఎంటో చూద్దాం..!

బంగాళదుంపలు ఆకుపచ్చగా మారాయి, అంటే వాటిలో సోలనిన్ అనే విష పదార్థం చేరుతుందట. సాధారణంగా, సూర్యుడు బయటకు వచ్చినప్పుడు బంగాళాదుంపలో క్లోరోఫిల్ ఏర్పడటం ప్రారంభమవుతుంది. కానీ క్లోరోఫిల్ కనుగొనబడే సమయానికి, బంగాళాదుంపలలో సోలనిన్ అనే టాక్సిన్స్ ఏర్పడటం మొదలవుతుంది.

సోలనిన్ పాయిజన్ ఎందుకు తయారవుతుంది?

బంగాళదుంపలు ప్రధానంగా కీటకాలు లేదా ఇతర జెర్మ్స్ నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈ రసాయనాలను తయారు చేస్తాయట. కానీ సోలనిన్ మానవ శరీరంలో విషాన్ని కలిగిస్తుంది. కాబట్టి, బంగాళాదుంప పచ్చగా మారితే అస్సలు వాడుకోకూడదు. అయితే..ఈ క్రమంలో ఆ భాగం వరకూ కట్‌ చేసి.. వాడుకోవచ్చు అనుకుంటున్నారేమో. సాధారణంగా ఇంట్లో వంటచేసేవాళ్లు.. కూరగాయలు ఏదైనా పాడైంది అంటే.. ఆ ఏరియా వరకే కట్‌ చేసి వాడతారు… అసలు ఏ కూరగాయ అయినా పాడైంది అంటే.. అది మొత్తానికి వాడకూడదు. సగం సగం కట్‌ చేసి.. వాడే పద్ధతి ఏమాత్రం మంచిది కాదు.

బంగాళదుంపలో పచ్చభాగం ఏర్పడితే.. సోలనిన్ బంగాళాదుంప అంతటా వ్యాపిస్తుంది. మొత్తం బంగాళాదుంపలు విషపూరితం అవుతాయి. అలాంటప్పుడు మీరు గ్రీన్‌ ఏరియా వరకే కట్‌ చేసినా వాడినా. ప్రయోజనం ఉండదు. విషాన్ని తిన్నట్లే..ఇలాంటి బంగాళదుపంలు తినటం వల్ల పెద్దలలో తీవ్రమైన కడుపుకు సంబంధించిన వ్యాధులు ,విరేచనాలు వస్తాయి. పచ్చి బంగాళదుంపలు తింటే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యు నిపుణులు.

కాబట్టి ఈసారి బంగాళదుంపలు వాడేప్పుడు కాస్త జాగ్రత్తగా పరీక్షించి వండుకోవాలని మర్చిపోకండే.. ఆకుపచ్చరంగు ఉన్న బంగాళదుంపను మాత్రం పొరపాటున కూడా వాడొద్దే..!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version