సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో బయటకు కనిపించినంత అందంగా వ్యక్తిగత జీవితం ఎవరికి అంత అందంగా సాగదు అనడంలో సందేహం లేదు. ప్రతిరోజు ఒక పోరాటం చేయాలి . బ్రతకడానికి భవిష్యత్తుకు వెళ్లడానికి ప్రతి రోజు యుద్ధం చేయక తప్పదు. ఎక్కడ తమ పరుగు ఆగిపోతుందో అక్కడే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే రాత్రికి రాత్రి వారి అడ్రస్ గల్లంతు కూడా కావచ్చు. అదృష్టం వుండి ఒక సినిమా హిట్ అయితే వారి పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. అందుకే ఒక సినిమా కన్నా ముందే ఒకటికి రెండు సినిమాలు విడుదలవడానికి లేదా ఏడాదిలో ఒక హిట్ అయినా గట్టిగా కొట్టాలని ప్రతి ఒక్క హీరో లేదా హీరోయిన్ కోరుకుంటూ ఉంటుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా కొంతమంది కుర్ర హీరోయిన్ల రాకతో సీనియర్ హీరోయిన్ల జోరు తగ్గిపోతుంది. అందులో ముఖ్యంగా సమంత , రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. సమంత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ వన్ సైడ్ హీరోయిన్ అయిపోయింది. అందుకే హీరోలు ఎవరు ఈమెను కన్సిడర్ చేయడం లేదు. హిట్స్ పైన హిట్స్ కొడుతున్నప్పటికీ కూడా ఒక జోనర్ కే ఆమెను పరిమితం చేయడం వల్ల ఆమె అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు పూజ హెగ్డే పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది . ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసిన ఈమె పరాజయం పాలవడంతో దర్శకులు కూడా వెనకడుగు వేస్తున్నారు.
సీనియర్ హీరోలు కూడా ఆమె వైపు చూడడం లేదు దాదాపు కెరియర్ క్లోజ్ అవుతుందా అనే పరిస్థితి కూడా నెలకొంది . ఇక రష్మిక విషయం మరోలా ఉంది బాలీవుడ్లో బిజీ అయింది అందుకే తెలుగులో సినిమాలు చేయడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఒక్క పుష్ప సినిమా సీక్వెల్ మినహా మరే తెలుగు సినిమాను ఆమె ఒప్పుకోవడం లేదు ఇలా చేస్తే మరి కొద్ది రోజుల్లో తెలుగు వారు కూడా ఆమెను మరిచిపోతారు అనడంలో సందేహం లేదు.