రెడ్ వైన్ తాగుతున్నారా.. ఆ ప్రమాదం వచ్చే అవకాశం.. తస్మాత్ జాగ్రత్త..

-

మార్చి నెల వచ్చింది అంటే వేసవి కాలం కూడా మొదలైనట్టే..అప్పుడే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో జనాలు బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరి దృష్టి కూల్ డ్రింక్స్ పైకి వెళ్తూ ఉంటుంది.అయితే అటు కూల్ డ్రింక్స్ ఇటు మద్యం కాకుండా మద్యస్థంగా ఉండేది రెడ్ వైన్..రెడ్ వైన్ ని మహిళలు కూడా తాగుతూ ఉంటారు.

అయితే, ఈ రెడ్ వైన్ తాగడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు ఉండవని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ రెడ్ వైన్ ని అధిక మోతాదులో తీసుకోవడం వలన ప్రాణాంతకర వ్యాదులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ముఖ్యంగా క్యాన్సర్, హృదోగంతో పాటు డిప్రెషన్ లోనయ్యే అవకాశాలు ఉన్నాయి.

శుద్ధి చేయని చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్ష రసం తాగడం వలన కాలేయం దెబ్బతింటుంది. అలాగే రెడ్ వైన్ తాగడం వల్ల శరీరంలోని చెడు కొవ్వుశాతం పెరుగుతుంది. తేలింది. రెడ్ వైన్ తాగడం వలన ధీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. అలాగే చర్మం కళను కోల్పోతుంది. రెడ్ వైన్ తాగడం వలన కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మొటిమలు చర్మంపై గల మృతకణాల వలన రంధ్రాలు ఏర్పడుతాయి. సాధ్యమైనంత వరకూ రెడ్ వైన్ తాగకపోవడమే మంచిది.. ఇక వేరే సీతల పానీయాలను కూడా తాగడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.. ఏది ఏమైనా ఇంట్లో తయారు చేసుకొనే వాటిని తీసుకోవడం మంచిది.. ఆరోగ్యం.. ఆనందం కూడా.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని విషయం తెలుసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version