ఐసెట్ కు ప్రిపేర్ అవుతూన్నారా?ఇలా చదివితే మంచి మార్కులు మీ సొంతం..

-

ఏదైనా పోటీ పరీక్షలను ప్రిపేర్ అయ్యెవారు ముందుగా ఎగ్జామ్స్ గురించి పూర్తి విషయాలను తెలుసుకోవాలి. అప్పుడే ఆ పరీక్షలో మంచి మార్కులను పొందవచ్చు.ఐసెట్ పరీక్షల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..మామూలు ఐసెట్ 200 మార్కులకు ఉంటుంది.పరీక్షా సమయం 150 నిమిషాలు.ఇందులో సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్ 3 ఉంటాయి. సెక్షన్ 1లో లాజికల్ రీజనింగ్, సెక్షన్ 2లో మ్యథ్స్, సెక్షన్ 3లో వెర్బల్ ఎబిలిటీ ఉంటాయి. ఇవి కూడా వివిధ మోడళ్లను అనుసరించి ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి. ఇక సెక్షన్ ఒకటి నుంచీ లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఇందులో డేటా సఫిషియన్సీ, 1 నుంచీ 20 ప్రశ్నలు ఉంటాయి. ఇవి కాస్త టఫ్. తర్వాత నంబర్ సిరీస్ అనాలజీ నుంచీ 15 ప్రశ్నలు వస్తాయి.

వీటిలో కనీసం 10 మార్కులు వచ్చేయస్తాయి. వీటి తర్వాత ఫెటన్ సిరీస్, అనాలజీ నుంచీ కూడా ఇదే విధంగా ఉంటుంది. తర్వాత Odd Man Out నుంచి పది మార్కులకి ప్రశ్నలు ఉంటాయి. అలాగే కోడింగ్ డి కోడింగ్  నుంచీ కూడా 10 మార్కులు వస్తాయి. డేటా అనాలసిస్ వరకూ 10 మార్కులు. ఇక బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, క్లాక్స్, కేలండర్స్ వరకూ అన్నీ కూడా 15 మార్కులను కవర్ అవుతాయి..

సెక్షన్ 2లో మ్యాథ్స్ ఉంటుంది. అర్థమెటిక్ 35 ప్రశ్నలు, ప్యూర్ మ్యాథ్స్ 10 మార్కులు, స్టాటస్టిక్స్ అండ్ ప్రొబబిలిటీ నుంచీ 10 మార్కులకి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఈ మూడు సరిగ్గా చదవగలిగితే ఆల్మోస్ట్ 55 నుంచి 40 మార్కులు ఇక్కడ నుంచి పొందవచ్చు..వీటిలో కష్టమైన వాటిని వదిలేయడం మంచిది.బాగా తెలిసినప్పుడు మాత్రం వీటిని ఎటెంప్ట్ చేయాలి. ఇక సెక్షన్ 3 నుంచీ వెర్బల్ ఎబిలిటీ నుంచీ ఉంటాయి. వీటిలో వొకాబులరీ, రీడింగ్ పేసేజ్, మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. అంటే vocabulary నుంచి 15, reading comprehension నుంచి 20 మార్కుల ప్రశ్నలు వస్తాయి. తర్వాత ఫంక్షనల్ గ్రామర్, 20 ప్రశ్నలు, కంప్యూటర్ బిజినెస్ టెర్మినాలజీ నుంచీ 20. మొత్తం కలిపి 35 ప్రశ్నలు ఉంటాయి.వీటిని తెలిస్తే పక్కగా తెలిస్తే టచ్ చేయాలి అప్పుడే మంచి మార్కులు వస్తాయి.

సెక్షన్ 1 కి 50 నిమిషాలు సమయం ఇవ్వాలి. తర్వాత సెక్షన్ 2 కి 60 నిమిషాలు ఇవ్వాలి. తర్వాత ఇంగ్లిష్ కి 30 నిమిషాలు ఇవ్వాలి. అలాగే మిగతా అంతా కవర్ చేయడానికి 10నిమిషాలు సరిపోతాయి. సెట్ పరీక్షకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు.ఇది స్టూడెంట్స్ కు మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పాలి..మొదట సులువుగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాసి చివరి పది నిముషాల్లో  కొత్తవి టచ్ చేస్తే బెస్ట్..ఐసెట్‌ పరీక్షకు ఎలాంటి నెగిటివ్‌ మార్కింగ్ లేదు..

అందుకే మొదట ఐదు నిమిషాలు క్వశ్చన్‌ పేపర్‌ను పూర్తిగా చదివి.. క్విక్‌ ఆన్సర్స్‌ మార్క్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ ప్రశ్నలకు ఎంత టైం కేటాయించాలి అన్న విషయం విద్యార్థులకు అర్ధం అవుతుంది. మీకు వచ్చిన సమాధానాలు అన్ని పూర్తి చేసిన తర్వాతే.. మిగిలిన వాటికి ఆన్సర్స్ రాస్తే అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంతలో ఆఖరి 15 నిమిషాలు .. తప్పులు సరిదిద్దుకోవటంలో కేటాయించాలంటున్నారు. పరీక్షకు ముందు ఎలాంటి కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకూడదు. బేసిక్ మ్యాథమెటిక్స్ మీద షార్ట్‌కట్స్ ఎక్కువగా నేర్చుకోవాలి.ముఖ్యంగా ఓల్డ్ పేపర్స్ ను బాగా రివిజన్ చెయ్యాలి..టైం పెట్టుకొని పాత పేపర్స్ ను ఆన్సర్ చెయ్యాలి.అప్పుడే పరీక్షల్లో ఒక అవగాహన వస్తుంది.ఇలా చేస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది..ఈ టిప్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి..ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Exit mobile version