ఇంట్లో బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటున్నారా..? ఈ విషయాలు ముందు తెలుసుకోండి..!

-

మీరు ఈ మధ్య చూసే ఉంటారు.. ఆఫీసుల్లో, ఇళ్లల్లో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు. ఇంట్లో బుద్ధ విగ్రహాలు అలంకరించుకోవడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. అయితే బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు ఆ విగ్రహానికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను గురించి తెలుసుకోవాలి.. ఇలా నియమానుసారం బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే అదృష్టం మిమ్మల్ని వరించే అవకాశం ఉంటుందట..

ఇంట్లో ఒక నిర్ణీత ప్రదేశంలో బుద్ధ విగ్రహాన్ని ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల్లో మానసిక వికాసం, సామరస్యం వెల్లివిరుస్తుంది. గౌతమ బుద్ధుడు జ్ఞానం, సామరస్యం, ఆత్మ బలానికి చిహ్నం. ఫెంగ్షూయ్, వాస్తులో బుద్ధుని విగ్రహం పవిత్రమైందిగా బావిస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో కుడి మూలన బుద్ధుడి విగ్రహం పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

బుద్ధ విగ్రహాలు రకరకాల పద్ధతుల్లో తయారుచేసినవి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.. రకరకాల భంగిమల్లో కూడా దొరుకుతాయి. ఎలాంటి విగ్రహం ఎక్కడ అమర్చుకోవాలంటే..

పడుకుని ఉన్న బుద్ధుడు

కుడి చేతిని తలకింద పెట్టుకుని పడుకుని ఉన్న భంగిమలో ఉన్న బుద్ధుడు జ్ఞానం, ముక్తికి ప్రతీక. ఈ బుద్ధ ప్రతిమ ఇంట్లో శాంతి నెలకొనేందుకు దోహదం చేస్తుంది. ఇంట్లో పడమర దిక్కుగా ముఖం ఉండేలా అమర్చుకుంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.

ఆశీర్వదిస్తున్న బుద్ధ ప్రతిమ

ఆశీర్వాదం కోసం ఎత్తిన బుద్ధుడి చెయ్యి ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా నివారిస్తుందట…ఇలాంటి విగ్రహం శాతం, భయం నుంచి విముక్తికి సంకేతం. వాస్తు దోషాలను పోగొట్టేందుకు ఇలా ఆశీర్వాద భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఆశీర్వాద ముద్రలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా ఉంటుంది.

ధ్యాన బుద్ధ..

ధ్యానంలో ఉన్న బుద్ధుని ప్రతిమ ఇంట్లో శాంతిని తెస్తుంది…ఈ విగ్రహాన్ని మీరు ద్యానం చేసుకునే చోట పెట్టుకోవచ్చు. లేదా విశ్రాంతిగా గడిపే చోట కూడా ఈ చిత్రాన్ని లేదా విగ్రహాన్ని అలంకరించుకోవచ్చు. ఈ విగ్రహాన్ని చూసినపుడు ఒక శాంతి భావన మనసులోకి వస్తుంది.

తోటలో ఎక్కడ పెట్టాలంటే..

బుద్ధ విగ్రహం ఇంట్లో శాంతిని పెంచే సాధనం. దీన్ని బాల్కని లేదా తోటలో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. పూల మొక్క పక్కన ఈ విగ్రహాన్ని అలంకరించుకోవడం వల్ల అందంగా ఉండడం మాత్రమే కాదు ఆ ప్రాంతం అంతా కూడా పాజిటివ్ నెస్‌తో వైబ్రెంట్‌గా మారుతుంది. తోటలో విశ్రాంతి భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం లేదా ద్యాన బుద్దుడి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు.

బుద్ధ విగ్రహాన్ని అలంకించేందుకు కొన్ని వాస్తు నియమాలు..

అన్నింటి కంటే ముందు బుద్ధ విగ్రహం కేవలం ఒక అలంకార వస్తువు కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇది పవిత్రమైన, శక్తివంతమైన మూర్తి అని తెలుసుకోండి..
బుద్ధ విగ్రహాన్ని నేల మీద లేదా లాకర్‌లో పెట్టకూడదు
బుద్ధ విగ్రహం ఎప్పుడు కూడా చూసేందకు కంటికి సమాంతరంగా లేదా తలపైకెత్తి చూసే విధంగా పెట్టుకోవాలి. కళ్లు దించి చూసే విధంగా బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవద్దు.
కూర్చుంటున్నపుడు లేదా పడుకుంటున్నపుడు బుద్దుడి వైపు కాళ్లు ఉండకుండా జాగ్రత్త పడాలి.
విగ్రహం చుట్టు చెత్త చేరనియ్యకూడదు.
విగ్రహం, విగ్రహం పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా దుమ్ము, ధూళీ చేరకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
బెడ్ రూమ్‌లో, బాత్ రూమ్‌లో, వంట గదిలో బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version