ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసి రాత్రిపూట హాయిగా నిద్రపోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ కొంత మందికి నిద్ర సరిగ్గా పట్టదు. దాని గురించి వదిలేస్తే, మీరు నిద్రించే పొజిషన్ ఎలా ఉందనేది మీరెప్పుడైనా గమనించారా? ఒక్కొక్కరికీ ఒక్కోలా వారి వారి సౌకర్యాన్ని బట్టి నిదించే పొజిషన్ ఉంటుంది. ఎలా పడుకుంటే నిద్ర వస్తుందనేది వాళ్ళకే తెలుసు కాబట్టి, వాళ్ళకి నచిన పొజిషన్లో నిద్రపోతారు. కానీ మీకీవిషయం తెలుసా? మీరు నిద్రించే పొజిషన్ బట్టి మీ చర్మం ప్రభావితం అవుతుంది.
అవును, మీరు చదువుతున్నది నిజమే. మీరెలా పడుకుంటున్నారో దాన్ని బట్టి మీ చర్మం ప్రభావితం అవుతుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుంది? దానివల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి? ఎలా పడుకుంటే మీ చర్మానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక పక్క పడుకుంటూ మారుస్తూ ఉంటే
దిండు మీద తల ఒక వైపు పెట్టి పడుకుంటే అది మీకు సౌకర్యంగా ఉండవచ్చు. కానీ, మీ దిండు తయారీ అయిన బట్ట కారణంగా మీ ముఖంపై ప్రభావం పడవచ్చు. చెంప భాగం పూర్తిగా దిండు మీద పడుతుంది కాబట్టి, ఆ స్థానాల్లో చర్మం చిరాకుకి గురవుతుంది. అందుకే అలా పడుకోవాలనుకున్న వాళ్ళు సింథటిక్ వస్త్రంతో తయారు చేసిన దిండు కవర్లని వాడాలి. లేదంటే దిండు కవర్ వల్ల చర్మం పాడవుతుంది.
బోర్లా పడుకుంటే
పొట్ట నేల మీద ఆన్చి పడుకోవడం బాగానే ఉన్నప్పటికీ, దానివల్ల కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చే అవకాశం ఎక్కువ. మీది జిడ్డు చర్మం అయితే ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. మీ చర్మం నుండి వెలువడే నూనెలు మీ చర్మ రంధ్రాలని మూసివేస్తాయి.
వెల్లకిలా పడుకుంటే
ఇది అన్నింటికంతే మేలైన పొజిషన్. మీ ముఖం దిండుకి తాకే అవకాశం లేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది కాకుండా హాయిగా నిద్ర పడుతుంది కూడా.