జాజికాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సహజంగా మనం దీనిని బిరియాని వగైరా వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇది రుచి మాత్రమే ఇస్తుంది అనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే దీని కోసం తెలుసుకోండి.
30 నుంచి 40 ఏళ్లు ఉన్న వారిలో కూడా ఇది కనపడుతోంది. దీనిని అలానే వదిలేస్తే మంచిది కాదు. జ్ఞాపకశక్తి తగ్గిపోవటం వలన అనేక రకాల సమస్యలు ఇబ్బందులు కూడా వస్తాయి. ఇలా జరగడం వల్ల పని తీరు మందగిస్తుంది. ఏది ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముందుగా గుర్తిస్తే ఆ సమస్య నుంచి బయట పడొచ్చు.
ఈ ఆహార పదార్ధాలని తీసుకుంటే మతిమరుపును తగ్గించుకోవచ్చు. మతిమరుపును తగ్గించటానికి జాజికాయ బాగా ఉపయోగ పడుతుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని పాల లో పావు స్పూను జాజికాయ పొడి వెయ్యాలి. దీనిని బాగా కలుపుకుని తాగాలి. ఇలా కాక పోతే జాజికాయ పొడి లో కొద్దిగా తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. జాజికాయ లో ఉండే మినిస్టిసిన్ మెదడు పని తీరును మెరుగుపరిచి మతిమరుపు సమస్యను దూరం చేస్తుంది. కనుక ఈ సులువైన చిట్కాని పాటించి మతిమరుపు సమస్యని క్షణాల్లో తరిమి కొట్టేయండి.