చాలా మంది మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో పీసీఓడీ ఒకటి. పీసీఓడీ సమస్య నుండి బయట పడాలంటే మహిళలకి కాస్త కష్టమే. పీసీఓడీ సమస్య ఉన్న మహిళల్లో నెలసరి రెగ్యులర్ గా ఉండదు. అలానే ఓవరీస్ లో చిన్నచిన్న సిస్ట్స్ వంటివి ఫామ్ అవుతాయి. పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవడం, విపరీతమైన నొప్పి కలగడం ఇలా చాలా సమస్యలను ఎదుర్కొంటారు.
ఇలాంటి మహిళలకు పిల్లలు పుట్టడం కూడా కష్టమే. అయితే పీసిఒడి సమస్యతో బాధ పడుతున్న మహిళలు పీసీఓడీ సమస్య నుండి బయటపడాలంటే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మరి ఆ ఆహార పదార్థాల గురించి చూద్దాం.
పంచదార:
పీసీఓస్ తో బాధపడే మహిళలు పంచదారని తగ్గిస్తే మంచిది. పంచదారకు బదులు తేనెను కానీ బెల్లాన్ని కానీ వాడితే మంచిది.
ట్రాన్స్ ఫ్యాట్స్:
చాలా దేశాల్లో ట్రాన్స్ఫాట్స్ ని బ్యాన్ చేశారు. అన్ని కొవ్వు పదార్థాల కంటే ఇది బాగా చీప్ గా దొరుకుతుంది. వీటి వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పీసీఓస్ తో బాధపడేవాళ్ళు వీటికి దూరంగా ఉంటే మంచిది.
సోయా ప్రొడక్ట్స్:
సోయాతో చేసిన పదార్థాలకి కూడా దూరంగా ఉంటే మంచిది. ఇది కూడా పీసీఓస్ తో బాధపడే మహిళలు కి ఇబ్బంది కలిగిస్తుంది అదే విధంగా పీసీఓస్ తో బాధపడే మహిళలు కెఫిన్ మరియు ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. అలానే రిఫైన్డ్ చేసిన పిండిలకి కూడా దూరంగా ఉంటే మంచిది. ఇలా పీసీఓస్ తో బాధపడే మహిళలు ఈ ఆహార పదార్థాలకి దూరంగా ఉండి అనారోగ్య సమస్యల నుంచి బయట పడండి.