హెల్త్‌ ఇన్సురెన్స్‌ తీసుకుంటున్నారా..? ఈ పాయింట్స్‌ మిస్‌ కాకండి..!!

-

ఈరోజుల్లో చాలామంది.. వివిధ కారణాలతో బీమాలు తీసుకుంటున్నారు. ఎక్కువ శాలరీ వచ్చే వాళ్లు అయితే.. టాక్స్‌ల నుంచి తప్పించుకోవడానికి అయినా పనికొస్తుందని చేరుతున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెరగటం వల్ల చాలామంది.. హెల్త్‌ ఇన్సురెన్స్‌ తీసుకుంటున్నారు. భీమా కంపెనీలు కూడా ఈ సేవలను వినియోగదారులకు మరింత చేరువచేస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే పేమెంట్స్‌ చేసుకునే వెసులుబాటు కల్పించడంతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్య భీమాలను ఎంపిక చేసుకునే ముందు కచ్చితంగా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలనే తెలుసా.?
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను తీసుకునే ముందు పాలసీలో మీరు ఏయే వ్యాధులకు బీమా కవరేజీని పొందుతున్నారో చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ప్రస్తుతం బాధపడుతోన్న వ్యాధికి బీమా రక్షణ ఉంటుందో లేదో తెలుసుకోకుండా అస్సలు తీసుకోవద్దు. అలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
భీమాను ఎంచుకునే విషయంలో చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం… భీమా సంస్థ ఏయే ఆసుపత్రులలో మీకు నగదు రహిత చికిత్సను అందజేస్తుందో ముందే తెలుసుకోవాలి.
హెల్త్‌ ఇన్సూరెన్స్‌లతో యాడ్-ఆన్‌లు, రైడర్‌లను పొందినట్లయితే, కచ్చితంగా దాన్ని ఎంచుకోండి…అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఇది మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు కో పేమెంట్‌ ఆప్షన్‌ను పొరపాటున కూడా ఎంచుకోవద్దు. ఇలా చేయడం వల్ల ఆసుపత్రిలో అయ్యే మొత్తం ఖర్చును ఇన్సూరెన్స్‌ ద్వారానే పొందవచ్చు. ఒకవేళ కోపేమెంట్‌ ఆప్షన్‌ తీసుకున్నట్లైతే.. ఆసుపత్రిలో అయ్యే ఖర్చులో కొంత మేర మీరే చెల్లించాల్సి వస్తుంది.
మీరు తీసుకునే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో కవర్‌ చేయని విషయాల జాబీతాను రూపొందించుకోండి.
చాలామంది హెల్త్ ఇన్సురెన్స్‌లు కానీ.. ఇంకా మరేదైనా ఇన్సురెన్స్‌లు తీసుకునేప్పుడు అప్పుడున్న ఉత్సాహం కొద్ది తీసుకుంటారు.. కానీ రెండు మూడు పేమెంట్స్‌ అయిన తర్వాత సరిగ్గా డబ్బులు లేకనో, ఇంట్రస్ట్‌ లేకనో కట్టడం మానేస్తారు. దానివల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు. కట్టిన డబ్బు వృద్ధా అవుతుంది. ఇంకా హెల్త్‌ ఇన్సురెన్స్‌ తీసుకోనేప్పుడు తెలుసుకోవాల్సిన విషయం..ప్రమాదం జరిగినప్పుడు ప్రాసెస్‌ ఎలా ఉంటుంది. కొన్ని కంపెనీలు చాలా పెద్ద ఫార్మాలిటీస్‌ పెట్టుకుంటాయి.. దానివల్ల మీ టైమ్‌ వేస్ట్‌, సమయానికి బీమా డబ్బు అందకపోతే.. మీరే ముందు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకుని..స్నేహితులు, తెలిసినవాళ్లు కట్టమన్నారని కాకుండా. ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే అడుగేయండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version