నేడు హైకోర్టులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ జరిగింది. బిజెపి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ మహేష్ జట్మలాని వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని న్యాయవాది మహేష్ తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే సీట్ విచారణ జరుగుతుందని మహేష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు మహేష్.
ఎఫ్ఐఆర్ లో పోలీసులు రూల్స్ ఫాలో కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తరపున న్యాయవాది దుష్యంత్ దవేల, మహేష్ జట్మలాని మధ్య వాదనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు రాజకీయపరమైన విమర్శలు చేసుకున్నారు. దీంతో సీజే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కోర్టు మర్యాద పాటించాలని ఆయన సూచించారు.