ఆర్మీ జవాన్ ఇంట్లో సెక్స్ రాకెట్, వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపించి…!

-

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లోని ఓ ఇంట్లో అధికారులు భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసారు. ఓ ఆర్మీ జవాన్ ఇంట్లో ఈ సెక్స్ రాకెట్ బయటపడింది. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ జవాన్ ఇంటిని భారీగా అడ్వాన్సు చెల్లించి అద్దెకు తీసుకున్నారు కొందరు. అక్కడ వ్యభిచార౦ మొదలుపెట్టిన వాళ్ళు హర్యానాకు చెందిన ఒక డాన్సర్ ని కూడా తెచ్చారు.

ఇంటి చుట్టూ ఉన్న వారికి అనుమానం రావడంతో వాళ్ళు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనితో వాళ్ళు దాడులు చేయగా 17 ఏళ్ళ యువతీ, డాన్సర్ సహా మరో యువతిని, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. కోర్ట్ ఆదేశాల మేరకు వారు అందరిని అధికారులు కస్టడికి తరలించారు. ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకులు, తమ వద్దకు వచ్చే వారి నుంచి నుంచి,

ఒక్కొక్కరి వద్ద రెండు నుంచి ఆరు వేల వరకు వసూలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. అయితే ఆ అమ్మాయిలు ఎక్కడి వారని గుర్తించే పనిలో పడ్డారు. హర్యానా, ఢిల్లీ నుంచి యువతులను రప్పించి, వారి ఫొటోలను , వారితో సెక్స్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలిపే వివరాలను కూడా తమ కస్టమర్లకు వాట్సప్ నుంచి షేర్ చేయడమే కాకుండా కస్టమర్ రాలేకపోతే హోం డెలివరి సదుపాయం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version