తెలంగాణ బిజెపికి ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. బిజెపిలో చేరిన కొంతమంది గులాబీ నేతలు… మళ్లీ కెసిఆర్ చెంతకు వచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన పదిమందిలో ఐదు ఆరు గురు ఎమ్మెల్యేలు… గులాబీ గూటికి వచ్చేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. కానీ కెసిఆర్ వారిని.. చేర్చుకునేందుకు సిద్ధంగా లేరట.
అయితే ఈ నేపథ్యంలోనే ఆరూరి రమేష్… మళ్లీ గులాబీ గూటికి రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత… గులాబీ పార్టీని వీడారు ఆరూరి రమేష్. వరంగల్ ఎంపీ టికెట్ కోసం బిజెపిలో దూకేశారు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్.
అయితే ప్రస్తుతం బిజెపిలో… పెద్దగా స్కోప్ లేదని గ్రహించిన ఆరూరి రమేష్… సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతి త్వరలోనే మళ్లీ గులాబీ గూటికి వచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి కెసిఆర్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట ఆరూరి రమేష్.
ఆరూరి రమేష్ ఘర్ వాపసీ?
తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చూస్తున్న ఆరూరి రమేష్?
ఎంపీ టికెట్ కోసం బీజేపీ పార్టీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి
స్థానిక సంస్థల ఎన్నికల వరకు తిరిగి గులాబీ గూటికి రావడానికి ప్రయత్నాలు pic.twitter.com/eJVvX8GvuA
— Telugu Scribe (@TeluguScribe) November 28, 2024