ఇటీవల కాలంలో సినిమాలకు భాష అనేది అడ్డంకిగా లేదని చెప్పొచ్చు. అన్ని భాషల చిత్రాలు అన్ని భాషల్లో విడుదల అవుతున్నాయి. గతంలో తమిళ్ సినిమా, తెలుగు సినిమా, మలయాళ సినిమా, హిందీ సినిమా అని ఉండేది. కానీ, ఇప్పుడు ప్రతీ చిత్రం అన్ని భాషల్లో విడుదలవుతున్నది. ‘బాహుబలి’ నుంచి ఈ ట్రెండ్ మొదలైంది.
తమిళ్ హీరో ఆర్య నటించిన ‘కెప్టెన్’ తెలుగులోనూ విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో హీరో ఆర్య పాల్గొంటున్నారు. చిత్ర విశేషాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ RRR మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారన్న సంగతి అందరికీ విదితమే.
రామ్ చరణ్ గురించి అభిప్రాయం చెప్పాలని హీరో ఆర్యను ఇంటర్వ్యూలో అడిగారు. అప్పుడు ఆర్య మాట్లాడుతూ.. రామ్ చరణ్ నటనలో పరిణతి కనబడుతున్నదని, సినిమా సినిమాకు తనలో చాలా ఇంప్రుమెంట్ ఉందన్నాడు. తను వ్యక్తిగతంగా రామ్ చరణ్ ను ఎప్పుడూ కలవలేదని, కానీ, ఆయన సినిమాలు చూస్తానని చెప్పుకొచ్చారు.
RRR లో రామ్ చరణ్ యాక్టింగ్ చూసి హ్యాపీగా ఫీలయ్యానని, ఆయన నటుడిగా తనను తను చాలా ఇంప్రూవ్ చేసుకున్నారని కితాబిచ్చారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC 15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ స్టోరి అందిస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.