రజనీకాంత్ సూచన పాటించని అశ్వనీదత్.. ఆ తర్వాత ఎంత నష్టం జరిగిందంటే?

-

టాలీవుడ్ భారీ నిర్మాత అశ్వనీదత్ ఇటీవల ‘సీతారామం’ సినిమాతో చక్కటి విజయం అందుకున్నారు. ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుని దుల్కర్ సల్మాన్ వరకు చాలా మంది అగ్ర తారలతో చిత్రాలు తీసిన అశ్వనీదత్.. ఓ చిత్రం విషయంలో మాత్రం తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ సూచనను పాటించలేదు. దాంతో ఆయన చాలా నష్టపోయారు. ఆ సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండస్ట్రీలో అశ్వనీదత్ నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చేసిన అశ్వనీదత్.. తన కెరీర్ లో చేసిన తప్పిదం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను సూపర్ స్టార్ రజనీకాంత్ మాటను ఆ సినిమా తీసే క్రమంలో వినలేదని చెప్పారు. ఆ ఫిల్మ్ యే ‘శక్తి’. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ పిక్చర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఈ పిక్చర్ తీస్తు్న్న క్రమంలో అటువంటి సబ్జెక్స్ట్ తీయొద్దని రజనీకాంత్ తనకు సూచించాడని అశ్వనీదత్ తెలిపారు. అయితే, తాను అప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన క్రమంలో కంటిన్యూ చేశానని వివరించారు. తన భార్య కూడా శక్తి పీఠాల మీద సినిమా వద్దని తెలిపిందని , కానీ, తను తీసేశానని అశ్వనీదత్ స్పష్టం చేశారు.

ఇక ఈ సినిమా వలన తాను చాలా నష్టపోయానని అశ్వనీదత్ చెప్పారు. ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న అశ్వనీదత్ .. ఆ తర్వాత ‘మహానటి’ వంటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ తీశారు. ఇక ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ -కె’ను ప్రొడ్యూస్ చేస్తున్నారు అశ్వనీదత్. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి-2’ తీయాలని ఉందని అశ్వనీదత్ తెలిపారు. చూడాలి మరి.. భవిష్యత్తులో ఆ సినిమా వస్తుందో లేదో..

Read more RELATED
Recommended to you

Exit mobile version