కాంగ్రెస్ కు కొత్త చీఫ్ ను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి కొత్త పేరు తెరపైకి వచ్చింది. రాజస్థాన్ CM అశోక్ గెహ్లాట్ ఈ పదవి చేపట్టనున్నట్లు, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆయనకు ఆ పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
గాంధీల కుటుంబానికి గెహ్లాట్ విశ్వాస పాత్రుడు కావడం రాజకీయ అనుభవం ఈ ఎంపికలో కీలకం కానుంది అనే అభిప్రాయం ఉంది. కాగా ఈ వార్తలను గేహ్లాట్ త్రోసిపుచ్చారు.
కాగా ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మేరకు “వీడియో కాన్ఫరెన్స్” ( ఆన్‌లైన్) ద్వారా ఆగస్టు 28 న మద్యాహ్నా 3.30 గంటలకు “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర ప్రారంభం కానుంది. సెరెటంబర్ 4 న రాంలీలా మైదాన్ లో ధరల పెరుగుదల పై భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ లోపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భర్తీ చేయాలని సోనియాగాంధీ ఆలోచన చేస్తున్నారట.