ఆసియన్ గేమ్స్ 2023 లో భాగంగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు ఇండియా జట్టు.. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు వంతు వచ్చింది.. నిన్న ఉదయం జరిగిన క్వార్టర్స్ లో నేపాల్ ను ఓడించి సెమీస్ కు చేరుకుంది. ఇక తాజాగా కాసేపటి క్రితమే ముగిసిన నాలుగవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మలేషియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరుగుగాగా… ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను విజయం వరించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాను మలేసియా బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 116 పరుగులకే పరిమితం చేశారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన మలేసియా మూడు పరుగుల దూరంలో ఆగిపోయి ఓటమిపాలయింది. చివరి ఓవర్ వరకు తన జట్టును గెలుపు దిశగా నడిపించిన విరందీప్ సింగ్ ఆఖరి ఓవర్ లో అయిదు పరుగులు అవసరం కాగా, అఫిఫ్ హుస్సేన్ బౌలింగ్ లో వరుసగా మూడు బంతులు డాట్ కావడంతో, నాలుగవ బంతిని షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు.
దానితో మలేసియా గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయి. తద్వారా బంగ్లాదేశ్ సెమీస్ కు చేరుకొని ఇండియాతో తలపడే అవకాశాన్ని చేజిక్కించుకుంది.