వరి ధాన్యం పై సమస్య ఉంటే చెప్పండి.. కలిసి పోయి కేంద్రాన్ని అడుగుదామని సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేశాడు. వరి ధాన్యం సమస్య పార్టీ ల ది కాదని బండి సంజయ్ అన్నాడు. ఇది రైతుల సమస్య అని అన్నాడు. దీని పై కేంద్రం వద్ద కు వెళ్లి పరిష్కరించు కుందామని ముఖ్య మంత్రి కేసీఆర్ కు సవాల్ చేశాడు. అలాగే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయమని చెప్పిందని ముఖ్య మంత్రి కేసీఆర్ రాసిన లేఖ లో ప్రస్తవించాడా అని బండి సంజయ్ ప్రశ్నించాడు.
ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేకుండా తెలంగాణ లో నే ఈ సమస్య ఎందుకు ఉందని అన్నాడు. అలాగే రైతు బంధు వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఎక్కువగా అవుతున్నాయని రైతులే అంటున్నారని తెలిపాడు. అలాగే కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంటే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.