అస్సాంలో వరద బీభత్సం

-

దేశంలోని ప‌లు రాష్ట్రాలు భానుడి భ‌గ‌భ‌గ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. అస్సాంలో మాత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదల్లో చిక్కి అస్సాం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కురిసిన‌ భారీ వర్షాలకు అస్సాంలోని ఆరు జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. ప‌లు చోట్ల వరదలు పోటేత్తున్నాయి. కొండ చరియలు విరిగిప‌డుతున్నాయి. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో దాదాపు 1.97 లక్షల మంది ప్రజలు ఈ వ‌ర‌ద‌ల‌కు ప్రభావితమయ్యారు. అదే స‌మ‌యంలో అస్సాంలో ఇద్దరు, అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.

అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నివేదిక ప్రకారం.. ఒక్క క్యాచర్ జిల్లాలోనే 51,357 మంది వ‌ర‌దల‌కు ప్రభావితమయ్యారు. ఈ వరదల కారణంగా 46 రెవెన్యూ డివిజన్లలోని 652 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 16,645.61 హెక్టార్ల పంట నీట మునిగిపోయింది. భారీ కొండచరియలు విరిగిపడటం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోయాయి.

అసోం డిమా హసావో జిల్లాలోని ఎన్‌ఎఫ్‌ఆర్‌లోని లుమ్‌డింగ్-బాదర్‌పూర్ హిల్ స్టెష‌న్ లో రెండు రోజులుగా నిలిచిపోయిన రెండు రైళ్లలోని 2800 మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వం భారత సైన్యం, పారామిలిటరీ బలగాలు, అగ్నిమాపక, అత్యవసర సేవలు, SDRF, పౌర పరిపాలన , శిక్షణ పొందిన వాలంటీర్లల‌ను సహాయక చర్యల కోసం మోహరించింది ప్ర‌భుత్వం. కాచార్ జిల్లా యంత్రాంగం, అస్సాం రైఫిల్స్ జాయింట్ వెంచర్ బరాక్లా ప్రాంతంలో వరద బాధితులను రక్షించి సహాయ శిబిరాలకు త‌ర‌లించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version