బ్రేకింగ్ : భారత్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి గ్రీన్ సిగ్నల్

-

భారత్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు ఈరోజు సమావేశం అయిన నిపుణుల కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ  కోవిషీల్డ్ వ్యాక్సిన్  అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఈ రోజు అనుమతిచ్చింది. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అలానే ఆస్ట్రాజెనెకా సంస్థలు కలిసి రూపొందించాయి. ఇక ఈ వ్యాక్సిన్ ను భారత్ లో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసింది.  ఇప్పటికే  సీరం ఇన్స్టిట్యూట్ ఐదు కోట్ల వ్యాక్సిన డోసులను సిద్ధం చేసింది.

ఇక మరో పక్క ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీతో కలిసి భారత్‌ బయోటెక్‌ కోవాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్ నడుస్తోంది. 26వేల మందిపై మూడోదశ ప్రయోగం కొనసాగుతోంది. తొలి రెండు దశల ట్రయల్స్‌లో ఎలాంటి దుష్ప్ర్రభావాలు కనిపించలేదని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్నవారిలో ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్‌ ప్రభావాన్ని తగ్గించినట్లు ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్ని బట్టి తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version