గౌతమ్ రెడ్డిపైన ఉన్న అభిమానం వల్లే భారీ విజయం – మేకపాటి విక్రమ్ రెడ్డి

-

గౌతమ్ రెడ్డిపైన ఉన్న అభిమానం వల్లే భారీ విజయం సాధించామని ఆత్మకూరు వైసీపీ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల మద్దతులోనే ఇంత ఘాన విజయమని.. గౌతమ్ రెడ్డి పైన ఉన్న అభిమానం వల్లే భారీగా ఓట్లు వచ్చాయని వెల్లడించారు.

నాపై మరింత బాధ్యత పెరిగిందని.. ఓటమి వల్లే బి.జె.పి.నేతలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. హామీలను నెరవేరుస్తానన్నారు. కాగా… ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్‌రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. ఆత్మకూరు ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు.

రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌.. విక్రమ్‌రెడ్డికి ఏ మాత్రం పోటీనివ‍్వలేదు. ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీ ఏ రౌండ్‌లోనూ పోటీ ఇవ్వలేక చతికిలపడిపోయింది. ఈ ఫలితంతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పార్టీ వరుస ఓటముల పాలైంది. గతంలో తిరుపతి, బద్వేలు.. తాజాగా ఆత్మకూరులో అదే ఫలితం పునరావృతం అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version