విడుదలకు నోచుకోని సౌందర్య సినిమా.. కారణం.?

-

కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన సౌందర్య తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా వెంకటేష్ తో ఎన్నో సినిమాలలో నటించిన సౌందర్య అప్పట్లో వీరిద్దరిదీ ఆన్ స్క్రీన్ బెస్ట్ జోడి అని పేరు కూడా లభించింది. సౌందర్య తెలుగింటి ఆడపడుచులా ఎంతో అందంగా చూడచక్కని మోము తో ప్రేక్షకులను ఇట్టే అలరించేది .ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ సాంప్రదాయ దుస్తులు ధరించి ఎన్నో పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మన మధ్య లేకపోవడం ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు.

నిజానికి సౌందర్య మరణించినప్పటికీ ఆమె సినిమాలు టీవీ లో వస్తే మాత్రం మంచి టీఆర్పీ రేటింగ్ ను సాధిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే సౌందర్య బిజెపి పార్టీలో చేరిన తర్వాత పార్టీ ప్రచారం కోసం ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఫ్లైట్ కూలిపోయి అక్కడికక్కడే మరణించింది. చివరిసారిగా శివ శంకర్ సినిమాలో నటించి సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే సౌందర్య మరణించింది. ఇక ఆ తర్వాత ఆమె స్థానంలో డూప్ ను పెట్టి సినిమా కంప్లీట్ చేశారు. ఇకపోతే సౌందర్య నటించిన ఒక సినిమా ఇప్పటికే విడుదలకు నోచుకోలేదు అంటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఇక ఆ సినిమా కాపీ ఇప్పటికి కూడా రామోజీరావు ఫిలిం సిటీ లో దుమ్ము పట్టి అలాగే ఉండిపోయింది.

2002లో త్రిపురనేని వరప్రసాద్ మార్చి 20వ తేదీన రామోజీ ఫిలిం సిటీ లో గెలుపు అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఇందులో సుహాసిని, లయ తల్లి కూతురు గా నటించగా.. నరేష్ తండ్రి పాత్రలో నటించారు. ఇందులో సౌందర్య డిఫెన్స్ లాయర్ గా నటించింది. తాళి విలువ తెలియని భర్తకు భార్య విలువ తెలియాలి అనే కాన్సెప్ట్తో దర్శకుడు వరప్రసాద్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక బిడ్డలను కని వదిలేయడం కాదు వాళ్లను బాధ్యతగా చూసుకోవాలని అంటూ ఒక కూతురు గెలుపును చూపించడమే ఈ సినిమా కథ . 2003 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా .. షూటింగ్ సమయంలో ఎంతో మంది బయ్యర్స్ వచ్చినా..మేకర్స్ ఉషాకిరణ్ మూవీస్ వారే తీసుకుంటారని ధైర్యంతో ఎవరికీ ఇవ్వకుండా రామోజీ ఫిలిం నిర్మాత అలాగే ఉండిపోయారట. ఇక ఆ తర్వాత బయ్యర్స్ రాక , సినిమా విడుదల చేసే అవకాశం లేక అలాగే ఈ సినిమా కాపీ ఇప్పటికీ దుమ్ము పట్టి పోయింది . ఇక ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే సౌందర్య క్రేజ్ మరింత పెరిగి ఉండేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version