13 ఏళ్ళ బాలికపై ఆరు నెలలుగా దారుణం… తెలంగాణాలో దారుణ ఘటన…!

-

ఎన్ని చర్యలు చేపట్టినా సరే నేరాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా తెలంగాణాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం శాఖాపురంలో అమానుష ఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా లైంగిక దాడికి మృగాడు పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. మండలంలోని మాజీ ప్రజాప్రతినిధి వద్ద మూడేళ్లుగా పాలేరుగా జీవనం సాగిస్తున్నారు.

ఆ ప్రజాప్రతినిధి వద్దే డ్రైవర్ గా పనిచేస్తున్న శాఖాపురం గ్రామానికి చెందిన ఏర్పుల రమేష్ బాలికను బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనారోగ్యానికి గురైన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షల్లో గర్భవతి గా నిర్దారణ అయింది. పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా… నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version