దారుణం; రేప్ చేసి వీడియో తీసి, బాలికను గర్భవతిని చేసి, మేనత్తను కూడా…!

-

దేశంలో అత్యాచార ఘటనలు ఎన్ని చర్యలు తీసుకున్నా అదుపులోకి రాని సంగతి తెలిసిందే. చట్టాలు చేసినా సరే కామా౦దుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముంబై నగరంలోని ఖర్ ప్రాంతానికి చెందిన అజ్మల్ హుసేన్ లష్కర్ అనే 26 ఏళ్ళ యువకుడికి ఒక కార్యక్రమంలో ఒక మహిళ పరిచయం అయింది.

ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి ఆమెపై అత్యాచారం చేసాడు. ఇక ఆ యువకుడి కన్ను ఆమె మేనకోడలిపై కూడా పడింది. ఆ బాలిక మీద కూడా అత్యాచారం చేసాడు. ఇద్దరినీ అత్యాచారం చేసిన సంఘటనను వీడియో తీసాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అంటూ బెదిరించాడు. ఆ బాలికపై ఇలా బెదిరించి పలు మార్లు దారుణంగా అత్యాచారం చేసాడు.

ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. బాలిక గర్భం దాల్చడంతో బాధిత కుటుంబ సభ్యులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చెయ్యాలని కోరారు. దీనితో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు నిందితుడైన అజ్మల్ హుసేన్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, సెక్షన్ 4,8,12, పోస్కో చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని కస్టడికి తరలించారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version