హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై మరోసారి దాడి జరిగింది. విద్యుత్ చార్జీలు వసూలు చేయడానికి వెళ్లిన వ్యక్తి ఇంటి ఓనర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో వెలుగుచూసింది. రూ.2వేలకు పైగా కరెంటు బిల్లు పెండింగ్ ఉండటంతో కరెంట్ కట్ చేయడానికి వెళ్లిన విద్యుత్ ఉద్యోగి శ్యామ్ పై ఓనర్ దాడికి పాల్పడ్డాడు.
కరెంట్ బిల్లు ఎక్కువ రావడంతో బిల్లు చెల్లించలేదని ఓనర్ చెప్పినట్లు సమాచారం. దీంతో కరెంట్ కట్ చేయడానికి వెళ్లిన ఉద్యోగి శ్యామ్ మీద సదరు వినియోగదారుడు దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, సదరు ఉద్యోగి శ్యామ్ తనపై జరిగిన దాడి ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.
KPHB లో విద్యుత్ ఉద్యోగిపై దాడి
రూ. 2000కు పైగా కరెంటు బిల్లు పెండింగ్ ఉండటంతో, కరెంట్ కట్ చేయడానికి వెళ్లిన విద్యుత్ ఉద్యోగి శ్యామ్
బిల్లు ఎక్కువ వచ్చింది, కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నావంటూ విద్యుత్ ఉద్యోగిపై దాడికి ప్రయత్నించిన వినియోగదాడు
పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యుత్… pic.twitter.com/DD1RHI3AY9
— Telugu Galaxy (@Telugu_Galaxy) December 27, 2024