హీరోలకు 300 కోట్లు రెమ్యునరేషన్ ఎందుకు..సీపీఎం నేత సంచలనం !

-

టాలీవుడ్‌ హీరోలపై సీపీఎం నాయకుడు భీమగాని రాములు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హీరోలకు 300 కోట్లు రెమ్యునరేషన్ ఎందుకు..అంటూ సీపీఎం నాయకుడు భీమగాని రాములు రెచ్చిపోయారు. సినిమా ఇండస్ట్రీని రాజకీయ నాయకులు టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలోనే.. టాలీవుడ్‌ హీరోలపై సీపీఎం నాయకుడు భీమగాని రాములు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

CPM leader Bhimagani Ramulu’s controversial comments on Tollywood heroes

మీరు ఏం చేస్తున్నారు, ఎన్ని కోట్లు పెడుతున్నారు అని అడగడానికి రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళని తెలంగాణ పెద్ద పోలీస్ స్టేషన్‌కి పిలిపించాడని వెల్లడించారు. ఒకాయన 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంట.. భూ ప్రపంచం మీద అంత గొప్ప పని ఏం చేస్తున్నారని అన్ని కోట్లు తీసుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సమాజం కోసం ఏం చేస్తున్నారు.. ఈ ప్రభుత్వంలో మీరు ఏం భాగస్వామ్యం అవుతున్నారన్నారు సీపీఎం నాయకుడు భీమగాని రాములు.

Read more RELATED
Recommended to you

Exit mobile version