దుబ్బాక టెన్షన్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి పై దాడి ?

-

మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సిద్ధిపేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో టిఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు బస చేశారు. అయితే వారు తాము ఉన్న రూముల్లో నోట్ల కట్టలు ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు కొందరు లోపలి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారని ఆయన చెబుతున్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న తన మీద దాడి చేయడానికి బిజెపి కార్యకర్తలు ప్రయత్నించారు అని అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు.

తన మీద దాడి చేస్తుంటే కొంత మంది మా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని అయినా సరే నేనే టార్గెట్ అన్నట్టు వాళ్ళు నా మీదకు దూసుకు వచ్చారని ఆయన అన్నారు. తన రూం డబ్బులు ఉన్నయాని ఆరోపిస్తూ వాటిని వెతికేందుకు అక్రమంగా చొచ్చుకురావడానికి ప్రయత్నించినా సరే తాను వచ్చి వెతుక్కోవచ్చు అని చెప్పినా తన మీద దాడి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారని ఆయన ఆరోపించారు. వాళ్ళకి డబ్బులు ఉన్నాయో లేదో వెతికే ఉద్దేశం లేదని కేవలం ఎవరో ఒకరి మీద దాడి చేసి దాన్ని సెన్సేషన్ క్రియేట్ చేయాలని వచ్చారని ఆయన ఆరోపించారు. ఒక దళిత ఎమ్మెల్యే అయిన నాకే రక్షణ లేకుంటే రేపు దుబ్బాకలో గెలిస్తే ఇక్కడి ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version