గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్న ఓ యువకుడిని గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గత కొంతకాలంలో ఆ గ్రామంలో యువకులు గంజాయికి బానిసై గ్రామస్తులపై బ్లేడుతో దాడులకు పాల్పడుతునట్లు సమాచారం.
ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం గంజాయి మత్తులతో గ్రామంలో తిరుగుతున్న ఓ యువకుడిని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం స్తంభానికి కట్టేసి అతనికి దేహశుద్ది చేశారు.ఈ దాడుల్లో ఆ యువకుడిని దారుణంగా గాయాలయ్యాయి.నోట్లో నుంచి రక్తం స్రవించింది.అనంతరం అతని కట్లు విప్పి స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అనంతరం పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.