మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను అమలు చేస్తున్నారు. మహిళాలపై ఏదైనా దాడులు జరిగితే పోలీసులు వెంటనే స్పందిస్తూ, అరెస్ట్ చేస్తూ వస్తున్న కూడా లైంగిక దాడులు మాత్రం ఆగలేదు. ముఖ్యంగా వావి వరుసలు మర్చిపోయి మరి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కంటికి కనిపించిన అమ్మాయిల మాన ప్రాణాలను కనీసం కనికరం అన్నది లేకుండా తీస్తున్నారు.ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది..కదులుతున్న రైల్లో మహిళ పై అత్యాచారయత్నం జరిగింది. ఇందుకు మహిళ నిరాకరించడంతో ఆమెను రైలు లోంచి నిర్దాక్షిణ్యంగా తోసేశారు..
వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండాకు చెందిన 25 ఏళ్ల బాధితురాలు బండే అనే ప్రాంతం నుంచి వారానికోసారి బాగేశ్వర్‌ధామ్‌కి రైలులో వెళ్తుంటుంది. గత శనివారం ఆమె తన ఇంటికి వెళ్లడానికి లలిత్‌పూర్-ఖజురహో రైలు ఎక్కింది. ఆ రైలులో బాధితురాలు ఎక్కిన భోగీ అంతా ఖాళీగా ఉంది. ఛతర్‌పూర్‌లో ఓ యువకుడు
ఆ రైలు ఎక్కాడు.. కొద్ది సేపు అయ్యాక అతనిలోని మృగం బయటకు వచ్చింది.
రైలు కదలగానే ఆమెపై వేధింపులకు దిగాడు. ఆ యువతిపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆ యువతి ఆ యువకుడి చేయి కొరికేసింది. దీంతో అతని చేతి నుంచి రక్తస్రావం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు బాధిత మహిళను కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. తర్వాతి రోజు ఉదయం అపస్మార స్థితిలో ఉన్న ఆ యువతిని ఓ గ్రామస్థుడు చూసి ఆస్పత్రికి తరలించాడు. బాధితురాలి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకొనే పనిలో ఉన్నారు