మంగళగిరి HDFC బ్యాంక్ లో చోరీకి యత్నం

-

మంగళగిరి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో చోరీకి యత్నించారు. షట్టర్ తాళాలు పగలగొట్టి బ్యాంక్ లోకి ప్రవేశించారు ముగ్గురు దొంగలు. పోలీస్ పెట్రోలింగ్ సైరన్ మోగడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి పరిశీలిస్తున్న పోలీసులు. మంగళగిరి నగరంలోని HDFC బ్యాంకులో చోరికి దొంగలు యత్నించారు.

ఈరోజు తెల్లవారుజామున 3:40 గంటల సమయంలో ముగ్గురు దొంగలు బ్యాంకు షట్టర్ తాళం పగలగొట్టి బ్యాంకు లోపలకు ప్రవేశించారు. పోలీస్ బీట్ లో ఉన్న పెట్రోలింగ్ వాహనం సైరన్ వినబడటంతో భయంతో దొంగలు పారిపోయారు. చోరీ యత్నంకు సంబందించిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి దొంగల బెడద చాలా ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. దొంగలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు సైతం ప్రమాదం పొంచి ఉందని సూచించారు పోలీసులు. సీసీ పుటేజీ పరిశీలించి దొంగలను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version