సామాజికంగా వెనుక బడిన వర్గాలకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలి : ఆదిమూలపు

-

వైసీపీ ప్రభుత్వం లో కులం మతం చూడకుండా పాలన సాగిందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. ఇవాళ ఆయన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మాట్లాడుతూ.. సామాజిక న్యాయం పాటించామని, సామాజికంగా వెనుక బడిన వర్గాలకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. 2019 వరకు స్తుల ఉత్పత్తి లో మన రాష్ట్రం 22 వ స్థానం లో ఉంచిందని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం లో దేశం లోనే మొదటి స్థానం లో ఉందని ఆయన వెల్లడించారు. తలసరి ఆదాయం లో 17 వ స్థానం లో ఉన్న మనం వైసీపీ ప్రభుత్వం లో 9వ స్థానానికి వచ్చామని, విద్యా వైద్యం లో పెనుమార్పులు తెచ్చామన్నారు ఆదిమూలపు సురేష్.

అంతేకాకుండా.. ‘ప్రభుత్వ స్కూళ్ల లో ఇంగ్లీష్ మీడియం తీసుకు వచ్చాం.. నిజం గడప దాటే లోపు అబద్దం ఊరు తిరిగి వస్తుంది.. ఆ అబద్ధాలను అడ్డుకోవాలని సంకల్పం తో నే ఈ బస్సు యాత్ర చేస్తున్నాం… జడ్జి ముందు అబద్ధాలు చెప్పి బయటకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు… ఒక రోజు హాస్పిటల్ లో వుండి బయటకు వచ్చేసాడు…. బీసీ లను యస్సీ లను ఓటు బ్యాంక్ గా టిడిపి వాడుకుంది… కానీ అదే వర్గాలను నేడు ఉన్నత స్థానం లో నిలబెట్టిన నాయకుడు జగన్, అభినవ అంబేద్కర్ మన జగన్….అభినవ పులే సీఎం జగన్ … మీ ఇంట్లో మంచి చేసిన నాయకుడ్ని మళ్ళీ గెలిపించాలని ,సీఎం చేయాలని కోరుతున్నా….’ అని ఆదిమూలపు సురేష్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version