ఆసీస్కు షాక్..2 పరుగులకే ఓపెనర్లు ఔట్

-

నాగ్ పూర్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. అయితే, టాస్ గెలిచిన ఆనందం వారికి ఎంతో సేపు నిలవలేదు. టీమిండియా పేసర్లు మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ లు ఆదిలోనే ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్ కు చేర్చారు. రెండు పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను సిరాజ్ LBWగా ఔట్ చేశాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగుల వద్ద స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను షమీ బౌల్డ్ చేశాడు. దీంతో పర్యాటక జట్టు కేవలం 2 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో లబూషేన్, స్టీవ్ స్మిత్ ఆడుతున్నారు.

టీమిండియా తుది జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు.

ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్టీవెన్ స్మిత్, మ్యాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్ కూంబ్, అలెక్స్ కేరీ (కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), లియోన్, మర్ఫీ, స్కాట్ బోలాండ్ ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version