జ‌కోవిచ్‌కు ఊర‌ట.. కేసును కొట్టేసిన ఆస్ట్రేలియా కోర్టు

-

టెన్నిస్ స్టార్ ఆట‌గాడు జ‌కోవిచ్ కు ఊర‌ట ల‌భించింది. ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం వీసా ర‌ద్దు చేసిన కేసులో జ‌కోవిచ్ కు అనుకూలంగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పును ఇచ్చింది. కార‌ణం లేకుండా జ‌కోవిచ్ విసాను ర‌ద్దు చేశార‌ని ఆస్ట్రేలియా కోర్టు అభిప్రాయ ప‌డింది. అంతే కాకుండా ఆ కేసును కూడా కోర్టు కొట్టేసింది. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడ‌టానికి లైన్ క్లియ‌ర్ అయింది. అయితే ఈ తీర్పు పై ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం మ‌రో సారి అప్పిల్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

ఇదీల ఉండ‌గా.. ఇటీవ‌ల కరోనా బారిన ప‌డ్డ జకోవిచ్ కోలుకున్నారు. అయితే తాను ఒక్క డోసు టీకా కూడా వేసుకోక‌పోవ‌డంతో ప్ర‌త్యేక అనుమ‌తితో ఆస్ట్రేలియా ఓపెన్ ఆడ‌టానికి ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ కు వ‌చ్చాడు. అయితే జ‌కోవిచ్ కు మిన‌హాయింపు కోసం కావాల్సిన ప‌త్రాలు లేవ‌ని ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేష‌న్ కార్యాల‌యం జకోవిచ్ వీసా ను ర‌ద్దు చేసింది. అలాగే జ‌కోవిచ్ ను ఒక డిటెన్ష‌న్ హోట‌ల్ లో జ‌కోవిచ్ ను ఉంచారు.

అయితే ఈ వీసా ర‌ద్దు పై జ‌కోవిచ్ కోర్టు ను ఆశ్ర‌యించాడు. ఈ రోజు ఈ కేసుపై విచార‌ణ సాగింది. అయితే జ‌కోవిచ్ కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. అయితే ఈ తీర్పు పై ఆసీస్ ప్ర‌భుత్వం మ‌రో సారి అప్పిల్ చేయ‌నుంద‌ని స‌మాచారం. అయితే ఒక వేళ జ‌కోవిచ్ వీసా ర‌ద్దు అయితే అత‌ను మూడు సంవ‌త్స‌రాల పాటు ఆస్ట్రేలియా రాకుండా నిషేధం ఎదుర్కొంటాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version