సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్: ఒటిటి లోకి “అవతార్ 2”

-

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ మరో అద్భుత సృష్టి అవతార్ – ది వే అఫ్ వాటర్ .. ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను తన వశం చేసుకుంది. కాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఒటిటి లో వస్తుందా అని సినీ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఇటీవల కాలంలో ఒక సినిమా ఒటిటి లో ఇంతకాలం వరకు రాకపోవడం మొదటిసారి అని చెప్పాలి. దాదాపుగా ఆరు నెలల పాటు ఒటిటి లోకి రాకుండా ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మరో రెండు రోజుల్లో ఈ సినిమా ఒటిటి ప్లాట్ ఫామ్ లలో రిలీజ్ కావడానికి సిద్ధం అయింది. జూన్ 7వ తేదీన డిస్నీ + హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ కానుంది.

ఇది నిజంగా సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఇప్పటికే థియేటర్ వసూళ్లతో పలు రికార్డు లను సృష్టించిన అవతార్ ఇప్పుడు ఒటిటి లో ఇంకెన్ని రికార్డ్ లను సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version