BREAKING : ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టుకు అవినాష్‌రెడ్డి

-

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చింది. నేను అరెస్టు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కూడా అవినాష్ రెడ్డి.. సహా… నిందితుడిగా సిబిఐ పేర్కొంది. దీంతో వైసీపీలో కల్లోలం చోటుచేసుకుంది.

మరోవైపు ఎంపీ అవినాష్​కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సీబీఐ నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. అయితే, తాజాగా ఈ కేసు లో బాగంగా ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేశారు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి. ఇక ఈ హైకోర్టులో ఉన్న అన్ని కేసుల వివరాలు తమ ముందు ఉంచాలని పేర్కొంది ధర్మాసనం.

Read more RELATED
Recommended to you

Exit mobile version