మరో కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్ లోకి తీసుకొచ్చిన యాక్సిస్ బ్యాంక్..!

-

ఇప్పటి కాలంలో చాలామంది షాపింగ్ చేయాలన్న, ఏదన్నా వస్తువు కొనాలన్నా గాని డబ్బులు ఇవ్వడంలేదు. ఎంచక్కా ప్యాంటు జేబులో నుంచి పర్సు తీసి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు స్వైప్ చేస్తున్నారు. జేబులో డబ్బులు ఉన్నాయా లేదా అన్న దానితో ఇంకా పని లేదు. అంత క్రెడిట్ కార్డు మాయ అయిపొయింది. అయితే ఇప్పుడు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు ఒక శుభవార్త అందించింది. మరో సరికొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పే, వీసా సంస్థల భాగస్వామ్యంతో యాక్సిస్ బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డు తీసుకురావడం గమనార్హం.

ఇంకా ఈ యాక్సిస్ కొత్త కార్డు విషయానికి వస్తే.. యాక్సిస్ ఏస్ క్రెడిట్ కార్డుగా బ్యాంకు తీసుకవచ్చింది. ఈ క్రెడిట్ కార్డు పై జరిపే ప్రెమెంట్స్ పై కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. క్యాష్ బ్యాక్ వివరాలలోకి వెళితే మొబైల్ రీచార్జ్, బిల్లుల చెల్లింపుపై 5 శాతం క్యాష్ ‌బ్యాక్ వస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే.. క్యాష్‌బ్యాక్‌ పై ఎలాంటి పరిమితి ఉండదు. 5 శాతం క్యాష్‌బ్యాక్ అంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. గూగుల్ పే ద్వారా మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్, బిల్ పేమెంట్ వంటి వాటిని ఈ కొత్త క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహిస్తే 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే స్విగ్గీ, జొమాటో ద్వారా ఫుడ్ ఆర్డర్ ఇస్తే 4 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా ఓలా ద్వారా ఆర్డర్లు చేసిన 4 శాతం క్యాష్ ‌బ్యాక్ అందిస్తుంది. ఇతర ట్రాన్సాక్షన్ల పై 2 శాతం క్యాష్‌ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్ వంటి వాటిల్లో కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే 5 శాతం క్యాష్‌ బ్యాక్ వస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలిసి ఉంటుంది. క్యాష్‌బ్యాక్ అనేది కొన్నింటికి వర్తించదు. ఈఎంఐ ట్రాన్సాక్షన్లు, క్యాష్ అడ్వాన్స్ ఇందులోకి వస్తాయి.

మీకు ఈ కార్డు కావాలనుకుంటే కొంత ఫీజు చెల్లించాలి. ఇందుకుగాను జాయినింగ్ ఫీజు రూ.499 గా ఉంది. అయితే కార్డు పొందిన 45 రోజుల్లోగా రూ.10,000కు పైగా ఖర్చు చేస్తే అప్పుడు ఈ రూ.499 మీకు వెనక్కి వచ్చేస్తాయి. అలాగే 2020 డిసెంబర్ 31లోపు కార్డు కోసం అప్లై చేసుకుంటే జాయినింగ్ ఫీజు ఉండదు. అంటే మీరు 499 రూపాయిలు ఆదా చేసుకున్నవారు అవుతారు. ఇక యాన్వల్ ఫీజు కింద కార్డు కావాలంటే మాత్రం ప్రతి సంవత్సరం రూ.499 చెల్లిస్తూ రావాలి. ఏడాదిలో కార్డు ద్వారా రూ.2 లక్షలకు పైన ఖర్చు చేస్తే అప్పుడు ఈ రూ.499 ఇక చెల్లించక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version