రెస్క్యూ టీమ్ పై కిరాతకంగా దాడి…! రక్తంతో బట్టలు తడిచిపోయాయి…!

-

వీధి కుక్కలు ఇతర జంతులు నిస్సహాయ స్థితిలో పడి ఉంటే వీరు బాధ్యత తీసుకొన్ని వాటికి చికిత్స చేస్తూ లాభాపేక్ష లేని సంస్థను నడుపుతున్నారు. కాగా నేడు విరికే నిస్సహాయా స్థితి ఎదురైంది. వీధి కుక్కలను సంరక్షించేందుకు వెళ్ళిన వీరిపై స్థానికులు తీవ్రంగా దాడి చేశారు. వీరి కారును కూడా ధ్వంసం చేశారు. దాంతో పోలీస్ స్టేష్ ను ఆశ్రయించిన వీరిలో ఒక మహిళా తమ దుస్థితిని సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేస్తూ ఆ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో చూస్తుంటే వీరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. రక్తంతో వారి బట్టలు తడిసిపోయాయి ఆ మహిళా తల నుండి రక్తం కారుతుంది తమ పరిస్థితిని వివరిస్తూ వీడియో రికార్డ్ చేసిన వారిని చూస్తుంటే ఎవ్వరికైనా భావోద్వేగం రాకతప్పదు.

ఈ ఘటన నేబర్‌హూడ్ వూల్ప్ అనే లాభాపేక్ష లేని సంస్థలో పనిచేస్తోన్న ఆయేషా క్రిస్టియానా తమ సంస్థలోని ఇతర సభ్యులతో కలిసి రాణి బాగ్‌లోని రిషినరగ్‌ ప్రాంతానికి వెళ్లింది. అక్కడి వీధి కుక్కలకు సాయం చేసే పనుల్లో తాము ఉండగా స్థానికులు తమ వద్దకు వచ్చి ఆకారణంగా తమను కొట్టారని ఆయేషా చెప్పింది. సేవా దృక్పడంతో వీరు సేవ చేస్తుంటే స్థానికులు వీరికి అడ్డుపడ్డారు. దుర్భాషతో దూషించారు అది సరికాదని వీరు సరిచెప్పడంతో వారు దాడికి దిగారు. తలలు పగిలేలా కొట్టారు మహిళా కదా అని కూడా చూడకుండా దాడి చేశారు. వారి ముఖాలు రక్తంతో తడిచాయి. తన వెంట ఉన్న విపిన్, అభిషేక్, దీపక్‌పై కూడా దాడి జరిగిందని ఆమె చెప్పింది. తమ కారు పై కూడా దాడి చేసి ధ్వసమ్ చేశారని ఆమె ఆ విజువాల్స్ ను చూపించింది. పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో ఆమె ఈ వీడియో తీసి పోస్టు చేసింది. తాము ప్రతి రోజు ఇటువంటి దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని మన దేశం లో ఇది చాలా సహజం అయిపోయిందని ఆమె చెప్పుకుంది. తమ లాంటి వాళ్ళని పట్టించుకునే వారు కానీ ప్రభుత్వం కానీ లేదని ఆమె బాధపడింది. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version