Ayodhya: అయోధ్య బాలరాముడి ముఖం రివీల్ చేశారుగా…

-

అయోధ్య రామ మందిరంలో గురువారం మంత్ర ఉచ్ఛరణల నడుమ బాల రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. తాజాగా, బాల రాముడి విగ్రహం ముఖాన్ని బయటి ప్రపంచానికి రివీల్ చేశారు. అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహం ముఖం ఇలా ఉన్నది.

 

ఐదు సంవత్సరాల బాలుడి రూపంలో నిలబడి ఉన్న స్థితిలో ఈ విగ్రహాన్ని చెక్కారు. కృష్ణ వర్ణపు శిలతో ఉన్న ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ఈ విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఈ బాల రాముడి చేతిలో  బంగారు వర్ణం గల విల్లు, బాణం ఉన్నాయి.ఈ అస్త్రాలను చేత పట్టుకుని నిలబడిన స్థితిలో ఉన్న విగ్రహాన్ని అరుణ్ యోగి రాజ్ చెక్కారు.ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి  దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అంతేకాకుండా దేశ విదేశాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరుకాబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version