కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ మరోసారి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి జయరామ్ 203 ఎకరాల భూ కుంభకోణం పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లా ఇప్పిలి మండలం, ఆస్పరి గ్రామంలో 203 ఎకరాలను భూమిని, అక్రమంగా తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, మీడియా ముందు ఆధారాలు చూపించారు అయ్యన్నపాత్రుడు. ఇట్టినా ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చెందిన భూమిని, మాజీ డైరెక్టర్ మంజునాథ అనే వ్యక్తి పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అన్నారు. మంత్రి కుటుంబ సభ్యుల పేరుమీద 92 ఎకరాలు , మిగతా భూమి ఆయన బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని ఆయన అన్నారు.
ఈ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని, కంపెనీ ప్రతినిధులు, బెంగళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. మంజునాథ ముందస్తు బెయిలు కూడా అప్లై చేసాడని అయ్యన్న పేర్కొన్నారు. మంత్రి కుటుంబ సభ్యులు ఆయన బినామీ సభ్యులు దీని మీద లోన్ తీసుకునేందుకు ప్రయత్నించారని, దీనిని ఆ కంపెనీ ప్రతినిధులు లేఖ ద్వారా అడ్డుకున్నారని ఆయన అన్నారు. ఆయన్ని ముందు మంత్రి వర్గం నుండి తప్పించి ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏసీబీ ద్వారా ఎంక్వయిరీ చేయించాలన్న ఆయన అలా చేయకుంటే ముఖ్యమంత్రికి భాగస్వామ్యం ఉందని భావించాలని అన్నారు. గతంలో బెంజ్ కారు పై ఆరోపణలు చేసే ఆధారాలు ఇచ్చాం ఇప్పటివరకు దాని మీద ఎలాంటి చర్యలు లేవని ఆయన అన్నారు.