దత్తాత్రేయ గారు పెట్టిన అలయ్ బలయ్ కార్యక్రమం రోజు చిరంజీవి , గరిక పాటి మధ్య చెలరేగిన వివాద మంటలు మాత్రం ఇప్పటికీ ఆరడం లేదు. ఈ వివాదాన్ని రామ్ గోపాల్ వర్మ తన కామెంట్స్ తో మరో స్థాయికి తీసుకు పోయాడు. ఆయన వరస ట్వీట్స్ తో గరికపాటి పై విరుచుకు పడ్డారు.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్ లో,‘‘అత్యాచారాలకు గురికావడంలో మహిళలదే బాధ్యత అన్నారని మహిళలందరూ ఇతడిని బొందపెట్టాలి’’ అని, అలాగే ,హిందుత్వం పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్న గరికపాటి నుంచి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. చిరంజీవి మాత్రం ఈ వివాదాన్ని ముగించాలని , అలాగే గరికపాటి పెద్దవారిని,ఆయనను ఏమి అనొద్దని ప్యాన్స్ కు సూచించారు. కాని ఈ వివాదంలో రీసెంట్ గా వేలు పెట్టిన బాబు గోగినేని మాత్రం, గరికపాటిని మాత్రం వదలడం లేదు.
అరాచకవాది లాగ మహిళలపై చెత్త వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికారులకు పిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈయనకు ఏమి తెలుసని శాస్త్రీయ సిద్ధాంతాల గురించి అందరికి చెబుతున్నాడని ఇలాంటి వ్యాఖ్యలు తగవు అని గరికపాటి పై గోగినేని మండిపడ్డారు. మొత్తానికి వివాదం చల్లారింది అనుకుంటే గోగినేని మాత్రం గిచ్చి మరీ మంట పెడుతున్నారు.