ఏటిఎం మెషిన్ నుంచి ఎక్కడైనా డబ్బులు వస్తాయి..కానీ వేడి వేడి ఇడ్లీ సాంబార్ రావడం ఏంటి.. అని షాక్ అవ్వకండి..ఇది వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.. మహా నగరాల్లోకి ఇడ్లీ ఆటోమేటిడ్ మేకింగ్ మిషన్‌లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ సరికొత్త రోబోటిక్ మిషన్‌ని బెంగళూరుకి చెందిన ఎంట్రప్రెన్యూర్స్ శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ రూపొందించారు. మన ఏటీఎం మిషన్‌లానే 24×7 సేవలందిస్తుంది. చాలా ఫ్రెష్‌గా వేడివేడి ఇడ్లీలను అందిస్తుంది. ఒక్కషాట్‌లో 72 ఇడ్లీలను కేవలం 12 నిమిషాల్లో అందిస్తుంది.
అంతేకాదండోయ్ బయట హోటల్స్ రెస్టారెంట్స్ మాదిరిగా టిఫిన్ తోపాటు చట్నీ, కారప్పొడి, సాంబర్‌తో సహా అందిస్తోంది. ఐతే మనం ఈ మిషన్ వద్దకు వచ్చి మెనులో మనకు నచ్చిన టిఫిన్‌ని సెలక్ట్ చేసుకుని దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి బిల్ పే చేస్తే…55 సెకండ్లలో మన ఆర్డర్ ప్యాక్ చేసి మన ముందు ఉంటుంది. ఈ ఆలోచన హిరేమత్‌కి 2016లో ఒక రోజు తన కూతురు అనారోగ్యం బారిన పడినప్పుడూ వచ్చినట్లు చెబుతున్నాడు. ఆ రోజు రాత్రి తన కూతురుకి వేడి వేడి ఇడ్లీ దొరక్కపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు.
అప్పుడు తనకు ఏ సమయంలోనైనా వేడివేడిగా ఫ్రెష్‌గా లభించాలే ఆహారం అందించాలని నిర్ణయించుకుని ఈ ఆటోమెటిష్ మిషన్‌ని తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మిషన్‌లో ఇడ్లీ, వడ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే సౌత్ ఇండియన్స్ వంటకాలకి సంబంధించిన తొలి అల్పాహర ఆటోమెటిక్ మిషన్ అని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఏటీఎం ప్రస్తుతం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్‌లను విస్తరింప చేయడమే కాకుండా ఈ ఏటీఎంలో జ్యూస్, రైస్, దోశ వంటి వాటిని కూడా అందించే ఏర్పాటు చేయాలనకుంటున్నట్లు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపాడు..మొత్తానికి ఈ మెషిన్ గురించి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..చాలా మంది ఆ వింతను చూడటానికి ఎగ బడుతున్నారు..టేస్ట్ అదుర్స్ అంటూ తింటూన్నారు కూడా..
Idli ATM in Bangalore… pic.twitter.com/NvI7GuZP6Y
— B Padmanaban (padmanaban@fortuneinvestment.in) (@padhucfp) October 13, 2022