బీసీల రిజర్వేషన్ అంశం గురించి ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాయడం జరిగింది. జగన్ సార్వత్రిక సంస్థల ఎన్నికలలో బీసీలకు గతంలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రతాపరెడ్డి అనే అతను పిటిషన్ వేశారు. హైకోర్టులో వేసిన పిటిషన్ లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని ….ఇచ్చిన తీర్పును జతచేసి మరియు పిటిషన్ వేయడం జరిగింది. దీంతో హైకోర్టు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.
అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే హైకోర్టులో బీసీ రిజర్వేషన్ ను సవాలు చేస్తూ వేసిన పిటిషనర్ ప్రతాపరెడ్డి చంద్రబాబుకి సన్నిహితుడు అని మీడియాలో, సోషల్ మీడియా వార్తలతో పాటు దిగిన ఫోటోలు కూడా బయట పడటం జరిగింది. ఈ పరిణామంతో బీసీల రిజర్వేషన్ అంశంలో బాబు గారు పెన్నులో ఇంకు డ్రైనేజీ పాలయింది. మొత్తం బాగోతం అంతా బయటపడటంతో బీసీల ద్రోహిగా చంద్రబాబుని అభివర్ణిస్తున్నారు బీసీల నాయకులు.