బిగ్ బ్రేకింగ్ : కెప్టెన్సీకి బాబర్ రాజీనామా !

-

 

టీ 20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లో పాక్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో… కెప్టెన్ బాబర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. బాబర్‌ అఫ్రీది సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ కెప్టెన్ బాబర్ ను ఉద్దేశించి పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ టి 20 కెప్టెన్సీ ని వదులుకొని వన్డేలు, టెస్టుల్లో జట్టును నడిపించడం పై దృష్టి సారించాలని ఆఫ్రిది సూచించాడు.

అదేవిధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా పేషావర్ జల్మీ కెప్టెన్సీ బాధ్యతలు అజం చేపట్టకూడదని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది పిఎస్ఎల్ సీజన్ వరకు కరాచీ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన బాబర్, వచ్చే ఏడాది సీజన్ లో పేషావర్ జల్మీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

“బాబర్ అజంను నేను చాలా గౌరవిస్తాను. అందుకే అతడు టీ20 క్రికెట్లో కెప్టెన్సీ ఒత్తిడిని తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. అతడు టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని వన్డే, టెస్ట్ ఫార్మాట్ లపై దృష్టి పెట్టాలి. షాదాబ్, రిజ్వాన్, షాన్ మసూద్ వంటి ఆటగాళ్ళకి టి 20 ఫార్మాట్ లో జట్టును నడిపించే సత్తా ఉంది. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా బాబర్ సారథ్య బాధ్యతలు చేపట్టకూడదు”. సామా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version