ఆ బ్యాంక్ కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్..!

-

ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ కస్టమర్స్ కి షాక్ ఇచ్చింది. ఇది కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే… ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ రుణ రేట్లు పెంచుతున్నట్లు చెప్పింది. బ్యాంక్ నుండి లోన్ తీసుకునే వాళ్ళ మీద ఇది ఎఫెక్ట్ చూపనుంది. ఇపుడు లోన్ తీసుకున్న వారి మీద కూడా ఈ ప్రభావం పడుతుంది.

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు ని కెనరా బ్యాంక్ 15 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచేసింది. అయితే ఈ రేట్లు నవంబర్ 7 నుండి అమలు లోకి రానున్నాయి. రెపో లింక్డ్ రిటైల్ లెండింగ్ రేట్లను కూడా బ్యాంక్ పెంచింది.

సోమవారం నుండి ఇవి అమలులోకి వచ్చాయి. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.1 శాతానికి చేరింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు అయితే 8.8 శాతానికి ఎగసింది. అలానే కొత్తగా ఎవరైనా లోన్ తీసుకోవాలని అనుకుంటే కూడా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 20 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఈరేటు 7.9 శాతంగా ఉండేది కానీ 8.1 శాతానికి చేరింది ఇది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతానికి పెరిగింది. ఇది వరకు అయితే ఇది 7.8 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే ఓవర్‌ నైట్, నెల రోజుల కి 7.05 శాతం నుంచి 7.25 శాతానికి వెళ్ళింది. హోమ్ లోన్ వడ్డీ రేటు 8.55 శాతం నుంచి 10.75 శాతం కి చేరింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version