బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ నేటి నుంచి జరగనుంది. ఈ టోర్నీ లో టైటిల్ ను నిలవబెట్టు కోవడానికి భారత్ నుంచి పీ వీ సింధు బరి లోకి దిగుతుంది. కాగ రెండళ్ల క్రితం జరిగిన చివరి ప్రపంచ ఛాపింయన్ టోర్నమెంట్ లో పీ వీ సింధు ఛాంపియన్ గా నిలిచి .. రికార్డు నెలకోల్పోంది. ఈ సారి కూడా పీ వీ సింధు యే హాట్ ఫేవరేట్ గా బరి లో కి దిగుతుంది.
అయితే ఈ మెగా టోర్నీలో మూడు సార్లు ఛాంపియన్ గా నిలిచిన స్పెయిన్ దిగ్గజం కరోలినా మారిన్ ఈ సారి టోర్నీ కి దూరం గా ఉంటుంది. కరోలినా మారిన్ టోర్నీ లో లేక పోవడం.. పీ వి సింధు కు కలిసి వచ్చే అంశం. అలాగే పీ వీ సింధు కు తొలి రౌండ్ లో బై లభించింది. దీంతో పీ వీ సింధు నేరుగా రెండో రౌండ్ లో ఆడనుంది. అలాగే పురుషుల విభాగం నుంచి శ్రీ కాంత్, ప్రణీత్, ప్రణయ్ తో పాటు యువ సంచలనం లక్ష్య సేన్ కూడా బరి లో ఉన్నారు. అలాగే డబుల్స్ లో కూడా భారత్ నుంచి పలు జోడీ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.